ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకే పాదయాత్ర

పుల్లూరు:

మహబూబ్‌నగర్ జిల్లాలోని 44వ నెంబర్ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న పుల్లూరు గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా గురువారం భారీ బహిరంగసభ నిర్వహించింది.  పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాల కోసం జగన్ ని త్యం ప్రజల్లో మమైకమై సమస్యలు తెలుసుకుంటుంటే టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించి జైల్లో పె ట్టించారన్నారు. జైల్లో ఉన్నప్పటికీ ప్రజల బా గోగుల గురించే ఆలోచిస్తున్నాడనీ, అందుకే బాధల్లో ఉన్న ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు జగన్ సూచన మేరకు షర్మిల యాత్ర చేపట్టిందని గుర్తు చేశారు.  ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన లభించింది. ఆ సమయంలో ‘జై జగన్.. జైజై జగన్’ అంటూ నినాదాలు మార్మోగాయి. ‘ త్వరలో మంచికాలం వస్తుంది. ఈ విషయం మీకు చెప్పి ధైర్యం నింపేందుకే షర్మిల యాత్ర చేపట్టింది. తెలంగాణ ప్రాంత ప్రజల వాదాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు టీఆర్‌యస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల్లో ఎవ్వరినీ పోటీకి దింపలేదు’’ అని విజయమ్మ గుర్తుచేశారు.

జిల్లా ప్రాజెక్టులకు పెద్దపీట

     మహబూబ్‌నగర్ జిల్లా ఎంతో వెనకబడి ఉందని గుర్తించిన వైయస్ రాజశేఖరరెడ్డి జలయజ్జంలో భాగంగా నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపించి అందుకు అవసరమైన నిధులు విడుదలచేశారని చెప్పారు. ఆయన మరణానంతరం ప్రాజెక్టులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా త యారయ్యాయని విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిఒక్క పేద కుటుంబంలో డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనే ఆకాంక్షతో వైయస్ ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని అమలు చేస్తే ప్ర స్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆ దుకోకుండా సర్‌చార్జీల పేరిట వేలాది రూపాయల విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

త్వరలో రాజన్న రాజ్యం
    

     బహిరంగసభలో అనంతరం షర్మిల మాట్లాడు తూ తెలంగాణ ప్రాంత ప్రజలకష్టాలను తెలుసుకునేందుకు వైయస్ రాజశేఖరరెడ్డి కూడా తన పాదయాత్రను తెలంగాణ నుంచే ప్రారంభిం చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ, రెం డు రూపాయలకే కిలోబియ్యం తదితర ప్ర భుత్వ పథకాలను వైఎస్ ఈ ప్రాంతం నుంచే ప్రారంభించారని చెప్పారు. జలయజ్ఙం పథకం ద్వారా కూడా తెలంగాణకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని వివరించారు. రాజశేఖరరెడ్డి ప్రమాదంలో మృతిచెందితే ఆ సంఘటనను త ట్టుకోలేక వందలాది మంది గుండెపోటు.. తదితర కారణాల వల్ల మృతి చెందితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఆ యా కుటుంబాలను పరామర్శించిన పాపానపోలేదన్నారు. ‘కాంగ్రెస్ పెద్దలు వైయస్‌ను దోషిగా చిత్రీకరించి ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి సిగ్గులేకుండా.. వారు ఇప్పటికీ ఆయన మా పార్టీనేనని చెప్పుకుంటున్నారు’ అని దుయ్యబట్టారు. జైలు నుంచి జగన్‌ను దేవుడే బ యటకు తీసుకొస్తాడని ఆ తర్వాత రాష్ట్రంలో రా జన్న రాజ్యం వస్తుందని అప్పటి వరకు ఓపిక పట్టాలని కష్టాల్లో ఉన్న ప్రజలకు షర్మిల భరోసాఇచ్చారు.

Back to Top