ప్రజాదరణ చూసి ఓర్వలేకనే నిందలు

పెద్దమునగాల (ఖమ్మం జిల్లా):

దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు తెలంగాణలో వస్తోన్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఇతర పార్టీల నేతలు వైయస్ఆర్ కుటుంబంపై నిందలు మోపుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు బాణోత్ మదన్‌లాల్ విమర్శించారు. షర్మిల చేపట్టిన పాదయాత్రకు ప్రాంతాలకతీతంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.

     తెలంగాణ ప్రాంతంలో షర్మిల చేస్తోన్న పాదయాత్రకు తరలి వచ్చిన జనసందోహాన్ని చూసి ఇతర పార్టీల నేతల కళ్లు బైర్లు కమ్ముతున్నాయని బాణోత్ మదన్‌లాల్ అన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని బాణోత్ మదన్‌లాల్ ధీమా వ్యక్తం చేశారు.

కమ్యునిస్టుల కోటలో వైయస్ఆర్ కాంగ్రెస్ పాగా


     కమ్యునిస్టులకు కంచుకోటగా చెప్పుకునే ఖమ్మం జిల్లాలోని కొణిజెర్ల, వైరా ప్రాంతాల నుంచి వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వందలాది కుటుంబాలకు చెందిన వారు పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి బాణోత్ మదన్‌లాల్ స్వాగతం పలికారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేయడం ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని మదన్‌లాల్ అన్నారు.

Back to Top