ప్రారంభ‌మైన 299వ రోజు నాటి ప్రజా సంక‌ల్ప‌యాత్ర


నేడు పార్వ‌తీపురంలో వైయ‌స్ జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌

విజ‌య‌న‌గ‌రంః  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 299వ రోజు విజయనగరం నియోజకవర్గంలోని సూరమ్మపేట నుంచి ప్రారంభమైంది.  వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. అక్కడి నుంచి నర్సీపురం, వసుంధర నగర్, ఎర్రా క్రిష్ణా కాలనీ, పార్వతీపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం పార్వతీపురంలోని పాత బస్టాండ్‌ సెంటర్‌ వద్ద జరిగే బహిరంగ సభలో జననేత వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు.  

Back to Top