ప్రజా స్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు

ప్రజాస్వామ్య వ్యవస్థలో
ప్రజలే న్యాయ నిర్ణేతలు గా వ్యవహరిస్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వసించే
వైఎస్సార్సీపీ వివిద ప్రజా సమస్యల మీద ప్రజాస్వామ్య పంథాలో పోరాటం చేస్తూ
వస్తోంది.

డిసెంబర్ ఒకటి నుంచి
ప్రజల్నిచైతన్య పరిచేందుకు ప్రజా చైతన్య యాత్రలు చేయాలని తెలుగుదేశం పార్టీ
నిర్ణయించింది. ఈ 18 నెలల కాలంలో సాధించిన అంశాల్ని ప్రజలకు వివరిస్తామని గొప్పలు
చెబుతోంది. వాస్తవానికి ప్రజల్లో ఈ చైతన్య యాత్రల మీద ఇప్పటికే ఆలోచన మొదలైంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చకుండా.. ఇప్పుడు గొప్పలు చెప్పుకోవటానికి,
ప్రజల్ని తప్పుదారి పట్టించడానికే ఈ యాత్రలు చేపడుతున్నట్లు ప్రజలు
భావిస్తున్నారు.

వాస్తవానికి ఎన్నికల సమయంలో
ఇచ్చిన హామీలను ఏమాత్రం తెలుగుదేశం పార్టీ 
పట్టించుకోవటం లేదు. ఒక్కటంటే ఒక్కటి ప్రధాన హామీని అమలు చేసిన పాపాన
పోలేదు. అటువంటి టీడీపీ తప్పిదాల్ని ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ ప్రజా బ్యాలెట్
విధానాన్ని ఎంచుకొంది. చంద్రబాబు ఇచ్చిన హామీల్ని ప్రశ్నలుగా మలిచి  ఈ బ్యాలెట్ ను రూపొందించటం జరిగింది. వంద
ప్రశ్నల్ని ఒక్కచోట చేర్చి ప్రశ్నావళి రూపొందించారు. ఈ ప్రశ్నావళిని పూర్తి చేసి,
చంద్రబాబు ప్రభుత్వ పనితీరు మీద తీర్పు ఇవ్వాలని కోరారు.

ప్రజా బ్యాలెట్ పత్రం ఈ
వెబ్ సైట్ హోమ్ పేజీలో లభ్యం.. www.ysrcongress.com

Back to Top