విజయవాడ: జనసేన పార్టీ లేదు, గుర్తింపు లేదు వైయస్ఆర్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈరోజు నీ గ్లాస్ నీ దగ్గర లేదని పవన్‌ను విమర్శించారు. బుధవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుకి బానిసలా బతుకుతున్నాడని..ఆయన జీవితం ఎలా అయిపోయిందో తెలుసని అన్నారు. పవన్‌ను నమ్ముకొని 10 సంవత్సరాలు జనసేన జెండా పట్టుకున్నారు.. గ్లాస్ పట్టుకున్నారు.. గ్లాస్ ని అందరికీ ఇచ్చేశావ్.. జెండాను చంద్రబాబుకి తాకట్టు పెట్టావని పేర్కొన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో 2014కి 2024కి తేడా ఉందా అని ప్రశ్నించారు. అదనంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పథకాలు ఇందులో యాడ్ చేశాడని వెల్లంపల్లి తెలిపారు. 2014లో ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా.. నిరుద్యోగ భృతి అన్నాడు ఇచ్చాడా ఇందులో ఏం చేశాడు.. మళ్లీ ఇప్పుడు ప్రజలను మోసం చేద్దాం అనుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చిత్తు కాగితంలా చూస్తారని దుయ్యబట్టారు. వైయస్ జగన్ మేనిఫెస్టో ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్లా చూస్తారని తెలిపారు. వైయస్ జగన్ మేనిఫెస్టో అమలు పరుస్తారని , చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చెత్త బుట్టలో వేసే మేనిఫెస్టో అని విమర్శించారు. దీనికి పవన్ కళ్యాణ్ యాడ్ అయ్యాడు ఇద్దరు చెత్త బుట్టేనని ఆరోపించారు. జూన్ 4 తర్వాత ఇద్దరినీ చెత్తబుట్ల ప్రజలు వేస్తారని పేర్కొన్నారు.