ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం పెడతారేమో!


ఎస్ కే యూనివర్శిటీ :

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు విశ్వాస తీర్మానం పెడతారేమోనంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చెణుకు విసిరారు. మరో ప్రజా ప్రస్థానం షర్మిల ఆదివారం సాయంత్ర 6.30 గంటలకు శ్రీ కృష్ణ దేవరాయ
విశ్వవిద్యాలయానికి చేరుకుంది. ఆమెకు అక్కడ వేలాది మంది ఘన స్వాగతం
పలికారు. ఆమెపై పూల వర్షం కురిపించారు. శ్రీ కృష్ణదేవరాయల విగ్రహానికి
షర్మిల, విజయమ్మ పూలమాల వేశారు. ఆమె చేతులెత్తి  అశేష జనసందోహానికి అభివాదం
చేశారు. విజయమ్మ ముకుళిత హస్తాలతో చిరునవ్వుతో ప్రజలను పలుకరించారు.
అనంతరం ప్రత్యేక వాహనంపై ఎక్కి ప్రసంగించారు. జాతీయ రహదారి మొత్తం జన
సందోహంతో నిండిపోయింది. జగన్ ఆదేశాలతో పాదయాత్రను చేస్తున్న చెల్లెలు
షర్మిలను చూసేందుకు ప్రజలు వెల్లువెత్తారు. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి,
తదితరులు ఆమె వెంట ఉన్నారు.
   మీ రాజన్న కూతురు, జగనన్న చెల్లెలుగా మీకు నమస్కారిస్తున్నానంటూ షర్మిల తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వైయస్ఆర్ సంక్షేమ పథకాలను ఎలా తుంగలో తొక్కిందో అమ్మ చెప్పారన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం.. వైయస్ఆర్ రెక్కల కష్టంపై వచ్చిందన్నారు. అలాంటి ఆయన పథకాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు.  రైతుల్ని నిర్లక్ష్యం చేశారనీ, విద్యార్జులకు మొండిచేయి చూపారనీ,  మహిళలను ఏడిపిస్తున్నారనీ, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారనీ, ఇలా ఒకటి రెండు కాదు... అన్ని వైయస్ పథకాలను ప్రభుత్వం నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. 'దీనిపై నిలదీయాల్సింది టీడీపీ. కానీ  అది ఆ పని చేయదు. మూడేళ్ళుగా తన బాధ్యతలను విస్మరించింది.' అంటూ మండిపడ్డారు. చంద్రబాబు మామనే బాబు వెన్నుపోటు పొడిచారన్నారు. ఎన్టీఆర్ అధికారంలోకి తెస్తే తాను అధికారాన్ని లాక్కున్నారని తెలిపారు. ముఖ్యమైన రెండు రూపాయల బియ్యం, సంపూర్ణ మద్య పాన నిషేధాలను బాబు  తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాట మీద నిలబడలేరని విమర్శించారు. 'ప్రాజెక్టులు, వ్యవసాయం దండగన్నారు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదు సోమరులవుతాన్నారు.' ఇవి ఆయన  మనసులో మాటలని ఎద్దేవా చేశారు. ఆయన హయాంలో నాలుగువేల మంది రైతులు ఆత్మహత్మ చేసుకున్నారనీ, ఇది ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదని షర్మిల చెప్పారు. మరవలేని విషయమిదని పేర్కొన్నారు.  ఆ తర్వాత వైయస్ సీఎం అయ్యాకా నాలుగువేల మంది రైతుల కుటుంబాలకూ లక్ష చొప్పున పరిహారం ఇచ్చారని చెప్పారు. ఇంటిపెద్ద చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో రాజన్నకు తెలుసు కనుక వారికి డబ్బిచ్చారని వివరించారు. 'వారి బకాయిలు మాఫీ చేశారు. రుణాలు రీషెడ్యూలు చేయించారు. రైతులంటే అంత రాజన్న ఎంతో ఇష్టం. ఎంత చేసినా చాలదనుకునే వారు.' అని వివరించారు.  
చంద్రబాబు ప్రస్తుతం పాదయాత్ర డ్రామా ఆడుతున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను  క్షమాపణ అడిగినప్పటికీ బాబు చేసిన పాపం పోదని స్పష్టంచేశారు. ఆయనను నమ్మి మళ్ళీ  ముఖ్యమంత్రిని చేయాలట అంటూ వ్యంగ్య బాణం విసిరారు. ప్రజలకు బాబు డ్రామాలు బాగా తెలుసునని స్పష్టంచేశారు. ఉదయించే సూర్యుణ్ణి ఎలాగైతే ఆపలేరో.. అలాగే జగనన్నను కూడా ఎవరూ ఆపలేరని షర్మిల పేర్కొన్ఆరు.  లక్ష ఎకరాలకు నీరివ్వాలనీ, గుడిసె ఉండకూడదనీ, ప్రతి ఇంటా డాక్టరో, ఇంజినీరో ఉండాలనీ రాజన్న ఆశించే వారు.. రాజన్న కలలన్నీ జగనన్న సీఎం అయితే నెరవేరతాయని చెప్పారు. స్కూళ్ళకు పంపడానికి సొమ్ము ఇస్తారు. వడ్డీ లేని రుణాలు ఇస్తారు. సకాలంలో వర్షాలు పడతాయి.. పంటలు పడతాయి. జగనన్న సీఎం అయ్యేంతవరకూ ఆయనను ఆశీర్వదించాలని కోరుతున్నామని షర్మిల ప్రజలకు విజ్ఞప్తిచేశారు

Back to Top