విజయవాడలో పోలీసుల అత్సుత్సాహం

విజయవాడః ఆటో డ్రైవర్ల సమస్యలపై రవాణా శాఖ అధికారులను కలవడానికి  ప్రజా స్వామ్య పద్దతుల్లో వెళుతున్న వారిని అడ్డగించి పోలీసులు మరోసారి తమ పచ్చపాతాన్ని చాటుకున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి పార్థసారథి నేతృత్వంలో ఆటోడ్రైవర్లు గురువారం ఉదయం విజయవాడలోని రవాణా శాఖ డిటిసిని కలవడానికి వెళుతుంటే, అనుమతి లేదంటూ పోలీసులు వారిని నివారించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆటో డ్రైవర్ల ప్రతినిధులకు మధ్యకాసేపు వాగ్వాదం జరిగింది. సమస్యలపై సంబంధిత అధికారులను కూడా కలవకూడదనే ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి కార్యక్రమాలకు అనుమతిస్తున్న అధికారులు, బృందంగా వెళుతున్న వారిని నివారించడం ఎక్కడి ప్రజాస్వామ్యమని పార్థసారథి మండిపడ్డారు. పోలీసుల వైఖరి నియంతృత్వ పోకడలకు నిదర్శమన్నారు.
Back to Top