ఫీజు దీక్షకు బయల్దేరిన విజయమ్మ

హైదరాబాద్‌, 6 సెప్టెంబర్‌ 2012 : వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఫీజు దీక్షకు బయల్దేరారు. హైదరాబా‌ద్లోని లోట‌స్ పాండ్ నివాసం నుంచి బయల్దేరిన ఆమె ఇందిరాపా‌ర్క్‌ వద్ద దీక్షాస్థలికి చేరుకుంటారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్న యధావిధిగా అమలు చేయాలన్న డిమాండ్‌తో, వారికి మద్దతుగా విజయమ్మ రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే.
ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెం‌ట్ ఫలాలు సక్రమంగా అందాలని ఆమె డిమాం‌డ్ చేస్తున్నారు. ఫీజు రీయింబ‌ర్స్మెం‌ట్పై ఆంక్షలు విధించి, పేదలకు ఉన్నత చదువులకు దూరం చేయొద్దంటూ విజయమ్మ ఫీజు దీక్ష‌ చేయాలని నిర్ణయించారు. కాగా విజయమ్మ ఫీజు దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతున్నారు.

Back to Top