పేదల చదువులపై శ్రద్ధ లేని ప్రభుత్వం!

ఎమ్మిగనూరు18నవంబర్ 2012: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థు లకు కనీస వసతులు కూడా కల్పించడం లేదంటే ఈ ప్రభు త్వానికి పేదల చదువుల పట్ల ఎంత మాత్రం శ్రద్ధ ఉందో తెలుస్తోందని షర్మిల విమర్శిం చారు. తగినంతమంది టీచర్లు, తరగతి గదులు, వంటగది, చివరకు యూనిఫామ్‌లు లేకపోవడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా  షర్మిల ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఒక పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. అక్కడ విద్యార్థులకు కనీస వసతులు లేకపోవడం పట్ల ఆమె విస్మయం వెలిబుచ్చారు.
"సగం మంది చెట్టు కింద చదువుకుంటారు. కనీసం గదులు కూడా లేవు. 250 మంది విద్యార్థులకు ముగ్గురే టీచర్లు ఉండడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.మొదటి మూడు నెలలు అసలు టీచర్లే ఉండరట. ముగ్గురు టీచర్లపై 250 మంది పిల్లలు ఆధారపడి ఉంటారు. ముగ్గురు టీచర్లు ఎంతసేపని చెపుతారు 250 మందికి!" అని ఆమె వ్యాఖ్యానించారు.
దీన్నింతా చూస్తుంటో పేదల చదువుల పట్ల ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ లేకపోయిందో అర్థమౌతోందని ఆమె విమర్శించారు. "కనీసం యూనిఫామ్స్ కూడా లేవు. అన్నం పప్పూ మాత్రమే తిన్నారట. తాగడానికీ నీళ్లు కూడా లేవు. జగనన్న సిఎం అయ్యాక మీకు అన్ని విధాలా అండగా నిలుస్తాడు " అని షర్మిల హామీ ఇచ్చారు. పేదరికం నుండి బయటకు రావాలంటే  ప్రతి కుటుంబానికీ చదువు చాలా అవసరమని షర్మిల అన్నారు. రాజశేఖర్ రెడ్డిగారు ఇదే ఆశించారని ఆమె విద్యార్థులకు చెప్పారు. మనసుపెట్టి బాగా చదువుకోవాలని ఆమె సలహా ఇచ్చారు.

Back to Top