ప‌ట్టిసీమ కు రాజ‌ధానికి లింకు ఏమిటంటే..!

ప‌ట్టి సీమ క‌డ‌తాం..రాయ‌ల సీమ కు నీళ్లు తెస్తాం అంటే చంద్ర‌బాబు అండ్ గ్యాంగ్ చెబుతుంటే తెలుగుదేశం నేత‌లు తందానా తానా అంటున్నారు. కానీ అస‌లు సంగ‌తి తెలుసుకొంటే అదే రాయ‌ల సీమ నేత‌లు రాళ్ల తో కొడ‌తారు. ప‌ట్టి సీమ అన్న‌ది ఒక ఎత్తిపోత‌ల ప‌థ‌కం. అంటే ఇందులో ఎక్క‌డ రిజ‌ర్వాయ‌ర్ అన్న ప్ర‌స‌క్తి లేదు. అంటే దాన‌ర్థం గోదావ‌రికి జోరుగా నీరు వ‌స్తున్న స‌మ‌యంలో అక్క‌డ నీటిని తెచ్చి కృష్ణా న‌దిలో పోస్తారు. అది కూడా ప్ర‌కాశం బ్యారేజ్ కు ఎగువ‌న క‌లుపుతారు. అదే స‌మ‌యంలో కృష్ణాకు కూడా జోరుగానీరు వ‌స్తుంది క‌దా. మ‌రి ఈ ప‌థ‌కం ఎందుక‌ని..! అన్న సందేహం క‌లుగుతుంది.
దీనికి స‌మాధానం ఇప్పుడు రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్ లో దొరికింది. రాజ‌ధాని అవ‌స‌రాల‌కు కావ‌ల‌సిన నీటిని ఎల్ల కాలం స‌ర‌ఫ‌రా చేయాలంటే కృష్ణా న‌దిలో అందుబాటులో ఉన్న నీరు చాలనే చాల‌దు. దీనికి రాజ‌ధాని ప్లాన్ లో వెసులుబాటు చూపించాలి. అంటే ప‌ట్టిసీమ ప‌థ‌కం ద్వారా నీటిని గోదావ‌రి నుంచి తెచ్చి పోస్తే కృష్ణా న‌ది ద్వారా రాజ‌ధాని ప్రాంతానికి స‌మృద్ధిగా నీరు అందుతుంది. అప్పుడు సింగ‌పూర్‌, జ‌పాన్ సంస్థ‌ల‌కు నీటికి ఎటువంటి ఇబ్బంది ఉండ‌దు. అందుకోస‌మే ఉరుకులు, ప‌రుగుల‌తో ప‌ట్టి సీమ ను పూర్తి చేసేందుకు చంద్ర‌బాబు త‌హ త‌హ లాడుతున్నారు.
అంటే ప‌ట్టి సీమ క‌డితే నీళ్లు ద‌క్కేది రాజ‌ధాని ప్రాంతంలోని సింగ‌పూర్‌, ఇత‌ర బినామీ సంస్థ‌ల‌కు అన్న మాట‌. నీళ్ల‌ను న‌ష్ట‌పోయేది ఉభ‌య గోదావ‌రి జిల్లాలు అన్న మాట‌. ఎప్ప‌టికైనా నీళ్లు వ‌స్తాయంటూ ఆశ‌గా ఎదురు చూసే ప్రేక్ష‌క పాత్ర రాయ‌ల‌సీమ‌ది అన్న మాట‌. కేవ‌లం సింగ‌పూర్ సంస్థ‌ల ప్ర‌యోజ‌నాల కోసం గోదావ‌రి జిల్లా ల సాగునీటి ప్ర‌యోజనాల్ని తాక‌ట్టు పెడుతున్న ఈ చంద్ర‌బాబుని ఏమ‌నాలి...!
Back to Top