పసిడిజిల్లాగా పాలమూరును చేయాలని తపించిన వైయస్‌

ఐజ (మహబూబ్‌నగర్‌ జిల్లా), 25 నవంబర్‌ 2012:  ప్రజలకు కనీసం తాగునీటిని కూడా సరఫరా చేయని దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలోనే చూస్తున్నామని షర్మిల నిప్పులు చెరిగారు. రాజన్న ఉన్నప్పుడు రైతన్న రాజులా బతికేలా చేశారని ఆమె అభివర్ణించారు. తెలంగాణ పేరుతో రాజకీయం చేసే వారికి గుణపాఠం చెప్పాలని ఆమె తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. పాలమూరును పచ్చని పసిడి జిల్లాగా అభివృద్ధి చేయాలని మహానేత వైయస్‌ కృషి చేశారని చెప్పారు. వైయస్‌ అమలు చేసిన పథకాలనే ఇప్పుడు తానూ అమలు చేస్తానంటూ మీ ముందుకు వస్తున్న అబద్ధాలకోరు చంద్రబాబు నాయుడికి సరైన బుద్ధి చెప్పాలని కోరారు. కుట్రలు పన్ని జగనన్నను కాంగ్రెస్‌, టిడిపి నాయకులు జైలుకు పంపించారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగనన్నకు బెయిల్‌ రానివ్వకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తరఫున మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న ఆయన సోదరి షర్మిల ఆదివారం సాయంత్రం మహబూబ్‌నగర్‌ జిల్లా ఐజలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్‌, టిడిపిల తీరును తూర్పారపట్టారు.

'మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా ఐజ చేరుకున్నప్పుడు షర్మిలకు వై‌యస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రజలకు కనీసం తాగునీటిని కూడా సరఫరా చేయని దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలోనే చూస్తున్నామని షర్మిల నిప్పులు చెరిగారు. రాజన్న ఉన్నప్పుడు రైతన్న రాజులా బతికేలా చేశారని ఆమె అభివర్ణించారు. తెలంగాణ పేరుతో రాజకీయం చేసే వారికి గుణపాఠం చెప్పాలని ఆమె తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.

పాలమూరును పచ్చని పసిడి జిల్లాగా అభివృద్ధి చేయాలని మహానేత వైయస్‌ కృషి చేశారని చెప్పారు. వైయస్‌ అమలు చేసిన పథకాలనే ఇప్పుడు తానూ అమలు చేస్తానంటూ మీ ముందుకు వస్తున్న అబద్ధాలకోరు చంద్రబాబు నాయుడికి సరైన బుద్ధి చెప్పాలని కోరారు. కుట్రలు పన్ని జగనన్నను కాంగ్రెస్‌, టిడిపి నాయకులు జైలుకు పంపించారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగనన్నకు బెయిల్‌ రానివ్వకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తరఫున మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న ఆయన సోదరి షర్మిల ఆదివారం సాయంత్రం మహబూబ్‌నగర్‌ జిల్లా ఐజలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్‌, టిడిపిల తీరును తూర్పారపట్టారు. 'మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా ఐజ చేరుకున్నప్పుడు షర్మిలకు వై‌యస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

పాలమూరు జిల్లా వాసులు త్యాగమూర్తులని మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎపుడూ చెబుతుండేవారని షర్మిల పేర్కొన్నారు. పాలమూరు జిల్లాను పచ్చని పసిడి జిల్లాగా మార్చాలని ఆయన నిరంతరం కలలు కన్నారన్నారు. ఏడు వేల కోట్ల ఖర్చుతో పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆయన తీవ్రంగా కృషి చేశారన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాలో ‌4 ప్రాజెక్టులు నిర్మించారన్నారు. ఆయన మరణానంతరం ఇంకా 25 శాతం పనులు మిగిలి ఉన్నాయని చెప్పారు. మూడేళ్ళయినా ఆ పనులు పూర్తి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వానికి మనసు రాలేదని దుయ్యబట్టారు. ఆర్‌డిఎస్‌ ఆధునికీకరణకు వైయస్‌ నిధులు కేటాయించిన విషయాన్ని షర్మిల గుర్తుచేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగుకు ఎంత నీరు అవసరమో, ఎంత విద్యుత్‌ కావాలో వైయస్‌కు స్పష్టంగా తెలుసన్నారు.

ఈ ప్రభుత్వ పాలనలో అన్నం పెట్టే రైతు కంట నీరు పెట్టుకుని ఏడుస్తున్నాడని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న ఉన్నప్పుడు రైతన్న ఉత్పత్తులకు మద్దతు ధర ఇప్పించారని తెలిపారు. కోటా సరుకులు ఏ ఒక్కరికీ సరిగా అందడంలేదని విచారం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు రాజన్న హయాంలో రోజుకు 100 నుంచి 130 రూపాయలు ఇచ్చేవారని, ఇప్పటి ప్రభుత్వం కేవలం 30 రూపాయలే ఇస్తోందన్నారు. ఇది కూలీల శ్రమ దోపిడీ కాదా అని షర్మిల సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతి మహిళను రాజన్న లక్షాధికారిని చేయాలని ఆ దిశగా పథకాలు ప్రారంభించారన్నారు. పావలా వడ్డీ పథకాన్ని ఆయన ప్రారంభించారన్నారు. ఇప్పుడు వారికి అసలు రుణాలు ఇవ్వడంలేదని ఆరోపించారు. ఆయన తరువాత వాటిని కిరణ్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. ప్రతి పేద ఇంటి నుంచి విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని, ఒక డాక్టరో, ఇంజనీరో అయితే ఆర్థికంగా ఆ కుటుంబమూ, రాష్ట్రమూ ఉన్నత స్థితికి చేరుతుందని మహానేత వైయస్‌ భావించారన్నారు. అందుకే వారికి ఫీజు రీయింబర్సుమెంట్‌ చేశారన్నారు. ఈ ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కాలని చూస్తోందని ఆరోపించారు. చదువు లేకుండా విద్యార్థులు ఇంటిలో కూర్చుంటే, కూలిపనులకు వెళుతుంటే ఆ పాపం ఈ ప్రభుత్వానికి కాదా అని షర్మిల సూటిగా ప్రశ్నించారు.

నిరుపేదలకు కూడా ధనవంతులతో సమానంగా కార్పొరేట్‌ వైద్యం అందించాలన్న సదుద్దేశంతో స్వయంగా వైద్యుడైన వైయస్‌ ఆరోగ్యశ్రీని ప్రారంభిస్తే దాన్నీ ఈ ప్రభుత్వం మూలన పెట్టేస్తోందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ముఖ్యమంత్రికో, మంత్రులకో జబ్బు చేస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్ళరని, అక్కడ మందులు, సూదులు ఉండవు కాబట్టి వారు కార్పొరేట్‌ ఆస్పత్రులకో, విదేశాలకో వెళ్ళి వైద్యం చేయించుకుంటారని చెప్పారు. పేదవాడి ఆరోగ్యం విషయంలో ఒక న్యాయం, ధనికులకు మరో న్యాయమా అని ఆమె ప్రశ్నించారు. రాజన్న ఉన్నప్పుడు కుయ్‌.. కుయ్‌.. అంటూ వచ్చే 108 వాహనం ఇప్పుడు ఫోన్‌ చేసిన కనిపించడంలేదన్నారు. డీజిల్‌ లేక ఆ వాహనాలు మూలన పడ్డాయన్నారు. ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనత వైయస్‌దే అన్నారు.

జగనన్న బయట ఉంటే కాంగ్రెస్‌, టిడిపిలు తమ దుకాణాలు మూసుకోవాల్సి ఉంటుందని షర్మిల వ్యాఖ్యానించారు. అందుకే ఆ రెండు పార్టీలు కుట్ర చేసి, సిబిఐని వాడుకొని జగన్‌ను జైలుకు పంపించాయన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయనకు బెయిల్‌ రానివ్వకుండా అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు. వెలుగులు విరజిమ్మే సూర్యుడ్ని చేతులు అడ్డం పెట్టి ఆపలేనట్లే జగన్మోహన్‌రెడ్డిని నిలువరించడం ఎవరి తరమూ కాదని షర్మిల ధీమా వ్యక్తంచేశారు. జగన్మోహన్‌రెడ్డికి 5 లక్షల మెజారిటీ రావడమూ నేరమే అన్నట్లుగా కాంగ్రెస్‌, టిడిపిలు దుస్తంత్రాలు చేస్తున్నాయని అన్నారు.

రాజన్న అమలు చేసిన పథకాలనే తాను తీసుకువస్తానంటూ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పాదయాత్రలో చెబుతుండడాన్ని షర్మిల ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏదీ చేయాలనిపించని చంద్రబాబు ఇప్పుడు అబద్ధపు హామీలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు తీరు చూస్తుంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా ఉందని అన్నారు. ఎప్పటికైనా పులి పులే అన్నారు. మామను వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు ఇప్పుడు అబద్ధాలు చెబుతూ అధికారం ఇవ్వాలని ప్రజలను కోరుతుండడం సమజసం కాదన్నారు. గతంలో రైతులను అవమానించి, ఆత్మహత్యలు చేసుకునేలా చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. అలాంటి బాబు ఇప్పుడు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న గ్రామాలకే పాదయాత్ర పేరుతో వెళ్ళి అధికారం ఇమ్మని అడగడానికి సిగ్గులేదా అని నిలదీశారు. చంద్రబాబు దుర్మార్గాల గురించి చెప్పుకుంటూ పోతే రోజులు చాలవన్నారు. ఈ అసమర్ధ ప్రభుత్వం పడిపోకుండా దొంగచాటుగా కాపాడుతున్నది చంద్రబాబే అని షర్మిల నిప్పులు చెరిగారు.

ఐజ చేరుకున్న షర్మిల స్థానికంగా ఉన్న బుడగ జంగాలతో కాసేపు మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని కోరుతూ షర్మిలకు బుడగజంగాలు వినతిపత్రం ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top