ఆ పాపం చంద్రబాబుదే..!

విజయవాడః నాన్న హత్య కేసును పునర్విచారణ చేపట్టాలని రంగా తనయుడు వంగవీటి రాధా అభిప్రాయపడ్డారు. హత్య తర్వాత సుమారు పుష్కరకాలంపైగా సాగిన సీబీఐ విచారణ అసమగ్రంగా పూర్తయిందని, ఇప్పటికీ సాక్ష్యాలు సజీవంగా ఉన్నాయన్నారు.  నిజాయితీగా విచారణ చేపడితే అసలు నిందితులు బయటికొస్తారన్నారు. ఆ కేసులో చంద్రబాబుదే ప్రధానపాత్ర అని ఎవరైనా చెబుతారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమైనా స్పందించి రంగా హత్య కేసును పునర్విచారణకు ఆదేశించాలని కోరారు.

ముమ్మాటికీ ఆ పాపం చంద్రబాబుదేనని రంగా సతీమణి రత్నకుమారి అన్నారు. ఇది ఇప్పుడు మేము అంటున్న మాట కాదు. హత్యకు సరిగ్గా 24 గంటలకు ముందు స్వయంగా రంగానే.. చంద్రబాబు అండ్ కో తన హత్యకు కుట్ర పన్నుతున్నారంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. అదే లేఖను కేంద్ర హోంమంత్రికి కూడా పంపారు. ఆ లేఖ అందేలోపే ఆయన దారుణహత్యకు గురయ్యారు. జోగయ్య రాసింది అక్షరాలా వాస్తవమని రత్నకుమార్ స్పష్టం చేశారు.
 
Back to Top