పల్నాట వెల్లువెత్తిన అభిమాన సంద్రం

ఆప్యాయతకు మరో రూపం పలనాడు. ఇంటికెవరొచ్చినా ఆదరించడం వారి నైజం. తాము ఎదురుచూసిన వ్యక్తి వస్తే అది రెట్టింపవుతుంది. ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న దివంగత మహానేత తనయే తమ ప్రాంతానికి రావడంతో ఆ ప్రాంతం అభిమానసంద్రమైంది. ప్రజానీకం పులకించింది. పల్నాడు ప్రజానీకం పులకించింది... గుండెనిండుగ అభిమానం ఉప్పొంగేలా సాదర స్వాగతం పలికింది.  ఆమె అడుగులో అడుగేస్తూ.. అభిమానం చెరగని ముద్రలు వేస్తోంది. మనసులోని బాధలన్నీ ఆమెతో పంచుకుంది.. ఆమె పలుకులతో సాంత్వన పొందుతోంది.

దాచేపల్లి(గుంటూరు):

అవ్వా..మీకు పించన్ వస్తుందా..అమ్మా.. మీ ఊళ్లో కరెంట్ ఎన్ని గంటలు ఉంటుందన్నా..మనూళ్లో రైతుల పరిస్థితి ఎలా ఉంది..అంటూ దాచేపల్లి మండలంలో శ్రీమతి షర్మిల ప్రజలను ప్రశ్నించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరిని కదిలించినా, ఏమి అడిగినా ఒకటే జవాబు.. ఈ ప్రభుత్వంలో మా సమస్యలు తీరవు. జగనన్నముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుంది. మా సమస్యలు తీరిపోతాయి.

     దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల దాచేపల్లి మండలంలోని శ్రీనగర్ గ్రామం నుంచి ఆదివారం ఉదయం  10 గంటలకు  పాదయాత్ర మొదలుపెట్టారు. వేల సంఖ్యలో ఎదురుచూస్తున్న నాయకులు, కార్యకర్తలు, అబిమానులు వెంటరాగా షర్మిల తన పాదయాత్ర కొనసాగించారు. కార్యకర్తల కేరింతలు, జయజయధ్వానాలు హోరెత్తగా వేగంగా అడుగులు వేస్తూ కార్యదీక్షతో సాగారు.తనకు ఎదురు పడిన ప్రతి అమ్మను, ప్రతి చెల్లిని, ప్రతి అన్నను పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. షర్మిల రాకతో ఆయా గ్రామాలు పరవశించాయి. మహిళలతో కర చాలనాలు చేస్తూ ముందుకు సాగిన షర్మిలపై శ్రీనగర్‌లో పూలవర్షం కురి సింది. గ్రామంలో దివంగత మహానేత వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిల శ్రీనగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు.

గామాలపాడులో ఘన స్వాగతం..
     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి స్వగ్రామం గామాలపాడులో శ్రీమతి షర్మిలకు ఘన స్వాగతం లభించింది. పల్నాటి చరిత్రను ప్రతిబింబిస్తూ ప్రధాన పల్నాటి నాయకుల వేషధారణలతో కళాకారులు ఆమెను కలిశారు. నాగళ్లు చేతబూనిన రైతులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న షర్మిల మహిళలతో ముచ్చటించారు. గ్రామంలో సమస్యలను, మహిళలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగారు. అనంతరం షర్మిల తన పాదయాత్రను నారాయణపురం గ్రామం వరకు కొనసాగించి రైల్వేస్టేషన్ రోడ్డు సమీపంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, వి ద్యార్థినులు, రైతులతో సమస్యలపై చర్చించారు. అనంతరం శ్రీమతి షర్మిల మాట్లాడుతూ తాను చేస్తున్న పాదయాత్రలో ఎవరిని కదిలించినా ఎన్నో సమస్యలు చెబుతున్నారని, ప్రజల సమస్యలు పరిష్కరించటంలో ఈ సర్కార్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు.

వైయస్ మరణంతో అభివృద్ధి తిరోగమనం..
     నారాయణపురం గ్రామంలో ప్రజలు చెప్పిన సమస్యలను ప్రస్తావిస్తూ ఈ సమస్యలు ఈ ఒక్క గ్రామానికే పరిమితం కాలేదనీ, రాష్ర్టంలోని ఏ గ్రామంలో చూసినా ఇలాంటి సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయని శ్రీమతి షర్మిల చెప్పారు. కరెంట్ ఉండటం లేదు...నీళ్లు లేవు..పొలాలు పండటం లేదు..రైతులకు గిట్టుబాటు ధరలే లేవు...ఇన్ని సమస్యల మధ్య ప్రజలు నలిగిపోతుంటే పట్టించుకోకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని, ప్రతి పక్ష నాయకుడిగా ఈ సమస్యలను ఎండగట్టాల్సిన చంద్రబాబు ప్రభుత్వంతో కుమ్మకై దోస్తీ చేస్తున్నాడని విమర్శించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ హయాంలో ఏ రైతును కదిలించినా బాగున్నామంటూ సమాధానం చెప్పే వారనీ,  ఇప్పుడు ఏ రైతును కదిలించినా అన్నీ కష్టాలే ఏకరువుపెడుతున్నారనీ పేర్కొన్నారు.

     బాధలు తట్టుకోలేక రైతుల పొలాలను, ఒంట్లోని కిడ్నీలను అమ్ముకునే దుస్థితి దాపురించిందన్నారు. మహానేత  హయాంలో ఏ నాడూ కరెంట్, గ్యాస్, ఆర్టీసీ చార్జీలను పెంచలేదనీ, అభివృద్ధి మాత్రం గణనీయంగా జరిగిందనీ తెలిపారు. మహానేత మరణం తర్వాత రాష్ర్టం అభివృద్ధిలో పన్నెండేళ్ళ వెనుకకు వెళ్లిందన్నారు. రాష్ర్టంలో ఇన్ని సమస్యలు తాండవిస్తుండగా సీఎం మాటలు కోటలు దాటుతున్నాయని, ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టించి 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. జైలులో ఉన్నా జగనన్న ధైర్యం ఏ మాత్రం సడలలేదని, ఏ తప్పు చేయని జగనన్న త్వరలోనే ప్రజల ఆశీర్వాదంతో బయటకు వచ్చి రాజన్న ఇచ్చిన ప్రతి మాటను నేరవేరుస్తారని, రాజన్న కన్న ప్రతి కలనూ నెరవేరుస్తారని ఆమె  హామీ ఇచ్చారు.
కేసనపల్లిలో రాత్రి బస
     నారాయణపురంలో సభ అనంతరం షర్మిల దాచేపల్లి మీదుగా కేసనపల్లి గ్రామానికి తన పాదయాత్రను కొనసాగించి అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బసలో విశ్రమించారు. సోమవారం కేసనపల్లి గ్రామం నుంచి తక్కెళ్ళపాడు గ్రామం వైపుగా షర్మిల పాదయాత్ర కొనసాగనుంది. షర్మిల పాదయాత్రలో పాల్గొన్న ప్రముఖుల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం, పార్టీ కేంద్ర నిర్వాహక మండలి సభ్యుడు ఆర్కే, కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, గుంటూరు జిల్లా పార్టీ పరిశీలకుడు పి.గౌతంరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, పార్టీ గుంటూరు నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ నాయకులు యెనుముల మురళీధర్‌రెడ్డి, చింతాసుబ్బారెడ్డి, సాయిబాబా, అన్నబత్తుని సదాశివరావు, జానీబాషా, చిట్టా విజయభాస్కరరెడ్డి, దేవళ్ళ రేవతి, మండపూడి పురుషోత్తం, షేక్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

Back to Top