ప్రజాసంకల్పం విజయాన్ని కాంక్షిస్తూ చిలుకూరుకు పాదయాత్ర

హైదరాబాద్ : వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పార్టీ ఐటీ విభాగం ,  తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వ ర్యంలో పార్టీ నాయకులు  చిలుకూరు బాలాజీ టెంపుల్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఆదివారం ఉదయం పార్టీ కేంద్రకార్యాలయం వద్ద ఈ పాదయాత్రను ఎంపి విజయసాయిరెడ్డి ప్రారంభించారు. 
హైదరాబాద్‌లోని పార్టీ కేంద్రకార్యాలయం నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆలయంలో 101 కొబ్బరికాయలుకొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చల్లా మధుసూదన్‌, కొండా రాఘవరెడ్డి సహా పలువురు ఐటీ వింగ్‌ సభ్యులు పాల్గొన్నారు.
Back to Top