పార్టీ పటిష్టతకు శ్రమించాలి: భూమా

కాకినాడ:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్ని స్థాయిల్లోనూ పటిష్టం చేయడానికి పార్టీ నాయకులు కృషి చేయాలని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సహకార సంఘాల ఎన్నికలు, సభ్యత్వ నమోదు, గడప గడపకూ వైయస్ఆర్ కాంగ్రెస్ తదితర అంశాలపై ఆయన దిశా నిర్దేశనం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో తొలుత జిల్లా నేతలతో సమావేశమై పార్టీ పరిస్థితిని సమీక్షించారు. అనంతరం నియోజకవర్గాల వారీగా నేతలతో చర్చించారు.  పార్టీ జిల్లా కన్వీనర్ కడుపూడి చిట్టబ్బాయి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, పెండెం దొరబాబు, చిర్ల జగ్గిరెడ్డి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజు పాల్గొన్నారు. సకాలం లో సభ్యత్వాలను పూర్తి చేసేలా నియోజకవర్గ నేతలతో మాట్లాడాలని చిట్టబ్బాయికి సూచించారు. అనంతరం నియోజకవర్గాల వారీగా నేతలతో నాగిరెడ్డి భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితి, చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకున్నారు. అందరూ ఐక్యంగా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ వైపే జనం

రామసముద్రం: ప్రజలందరూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, సింగిల్ విండో ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఘన విజయం సాధిస్తారని ఆ పార్టీ జిల్లా యువజన విభాగపు అధ్యక్షుడు ఉదయ్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలతో విసిగెత్తిపోయి మహానేత రాజన్న రాజ్యం కావాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.

Back to Top