పాలంగినుంచి ప్రారంభమైన యాత్ర

తణుకు, 01 జూన్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పాలంగి గ్రామం నుంచి మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. తొలుత ఆ గ్రామంలో ఆమె డాక్టర్ వైయస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహానేత విగ్రహానికి పూలమాల వేసి ఆమె అంజలి ఘటించారు. అంతకు ముందు తరలివచ్చిన అశేషజనవాహిని మధ్య ఆమె పాదయాత్రను ప్రారంభించారు. పాలంగి నుంచి ఉండ్రాజవరం, మోర్తా, దమ్మెను, నడిపల్లికోట, కానూరు క్రాస్‌రోడ్‌ల మీదుగా మునిపల్లి వరకు ఆమె పాదయాత్ర చేస్తారు. అక్కడే ఆమె రాత్రికి బస చేస్తారు.

Back to Top