ప్రజల ఉసురుతో ప్రాజెక్టులు వద్దు

తణుకు) ప్రజల ఉసురు పోసుకొనే విధంగా ప్రాజెక్టులు నిర్వహించటం మంచి పరిణామం కాదని ప్రతిపక్షనేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అభిప్రాయ పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో తలపెట్టిన మెగా ఆక్వా ఫుడ్ ప్రాజెక్టుని సముద్ర తీరానికి తరలించాలని ఆయన గట్టిగా కోరారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా తణుకులో పర్యటించారు. మెగా ఆక్వా ఫుడ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నమహిళల మీద కేసులు పెట్టి తణుకు సబ్ జైలు లో ఉంచారు. జననేత వైయస్ జగన్ నేరుగా సబ్ జైలుకి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. బాధితుల మీద హత్యాయత్నం కేసులు పెట్టడాన్ని ఆయన గర్హించారు. మెగా ఆక్వా ఫుడ్ ప్రాజెక్టను గ్రామాల మధ్య నుంచి తరలిస్తే అందరికీ మేలు అని ఆయన సూచించారు.

Back to Top