నిరసన దీక్ష ప్రారంభించిన విజయమ్మ

హైదరాబాద్, 28 మే 2013:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన దీక్ష‌ను పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రారంభించి, తానూ పాల్గొన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి శ్రీమతి విజయమ్మ నిరసన దీక్ష చేపట్టారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఈ నిరసన దీక్ష కొనసాగుతుంది. శ్రీ జగన్మోహన్‌రెడ్డి సతీమణి శ్రీమతి వైయస్ భారతి కూడా‌ ఈ దీక్షలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైయస్ అభిమా‌నులు భారీ సంఖ్యలో దీక్షలో పాల్గొనేందుకు తరలివచ్చారు.

Back to Top