నెట్టెంపాడులో మహానేత విగ్రహానికి షర్మిల అభిషేకం

నెట్టెంపాడు:

నెట్టెంపాడు ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాంగణంలో ఉన్న దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఆయన తనయ శ్రీమతి షర్మిల కృష్ణా జలాలతో అభిషేకం చేశారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పవర్ హౌస్‌ను దివంగత మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల గురువారం సందర్శించారు. ఇంజినీర్లతో మాట్లాడి హౌస్ వివరాలను తెలుసుకున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు నిర్వసితులను ఆమె కలుసుకున్నారు. వారి వెతలను తెలుసున్నారు. ఆయకట్లు రైతులోనూ మాట్లాడారు. నిర్వాసితులకు న్యాయం చేస్తామనీ, వారికి అండగా నిలబడతామనీ శ్రీమతి షర్మిల వారికి హామీ ఇచ్చారు. శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం గురువారానికి 43వ రోజుకు చేరింది. నెట్టెంపాడు నుంచి ఆమె తన పాదయాత్రను మొదలుపెట్టారు. ఎత్తిపోతల పథకాన్ని చూసి ఆమె ఉద్వేగానికి గురయ్యారు. కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలాయి.

Back to Top