నేటి నుంచి విజయమ్మ దీక్ష

హైదరాబాద్: విద్యార్థి లోకానికి మేలు చేసే ఫీజు రీయింబర్సుమెంట్ పథకంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి దీక్షకు పూనుకుంటోంది. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ గురువారం ఉదయం 10గంటల ప్రాంతంలో దీక్ష ప్రారంభిస్తారు. ఏడాది క్రితం పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి వారం రోజుల పాటు దీక్ష చేసిన ఇందిరా పార్కు వద్దే విజయమ్మ గురు, శుక్రవారాలలో దీక్షకు కూర్చుంటారు. ఫీజు పోరుకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మద్దతు లభించింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పలువురు విజ్ఙప్తి చేశారు. విద్యార్థులు లక్షలాదిగా తరలిరావాలని కోరుతున్నారు. ఫీజు రీయింబర్సుమెంటుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Back to Top