నవరత్నాల సభకు భారీ ఏర్పాట్లు

పార్వతీపురం

: పార్వతీపురం పట్ట‌ణంలో శనివారం జరగే నవరత్నాల సభకు వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. నియోజకవర్గ సమన్వయ కర్త జమ్మాన ప్రసన్నకుమార్ ఆధ్వ‌ర్యంలో పురపాలక సంఘం తరుపున స్థానికి విశ్వవిజ్ఙాన్‌ పాఠశాల ప్రాంగణంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నియోగక వర్గం వ్యాప్తంగా ప్రసన్నకుమార్‌తో పాటుగా ఆ పార్టీ నాయకలు అలజంగి జోగరావు, గర్భాపు ఉదయబాను ప్రచారం నిర్వహించారు .గ్రామగ్రామాన నవరత్నాల పథకాల ఉపయోగాన్ని తెలిపి సమావేశానికి రావాలని ఆహ్వానం పలికారు. ముఖ్యంగా బూత్‌లెవెల్‌ కమిటీ సభ్యులుతో పాటుగా కార్యకర్తలు,నాయకులు,కౌన్సిలర్లు,సర్పంచులు,ఎంపీటీసీలు ,యువత,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నవరత్నాల సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు బెల్లాన చంధ్రశేఖర్, ఉత్తరాంధ్రా రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కోలగట్ల విరబధ్రస్వామి, బొత్స అప్పలనర్సయ్య, ధర్మాన కృష్ణదాస్,హాజర‌వుతున్నారు

తాజా ఫోటోలు

Back to Top