పల్లెనిద్ర పై నంద్యాల పోలీసుల ఉక్కుపాదంక‌ర్నూలు:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేప‌డుతున్న ర‌చ్చ‌బండ‌, ప‌ల్లెనిద్ర కార్య‌క్ర‌మంపై పోలీసులు అత్యుత్సాహం చూపారు. నంద్యాల మండ‌లం కొత్త‌ప‌ల్లి గ్రామంలో ప‌ల్లె నిద్ర కార్య‌క్ర‌మంలో భాగంగా ఓ ఇంట్లో నిద్రిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ యూత్ నాయ‌కుడు శిల్పా ర‌విచంద్ర‌కిశోర్‌రెడ్డిని నంద్యాల పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప‌ల్లెనిద్ర కార్య‌క్ర‌మానికి అనుమ‌తి లేదంటూ ర‌విచంద్ర‌కిశోర్‌ను బ‌ల‌వంతంగా గ్రామం నుంచి బ‌య‌ట‌కు పంపించారు. పోలీసుల తీరును గ్రామ‌స్తులు, పార్టీ నాయ‌కులు తీవ్రంగా ఖండించారు.  వైయ‌స్ఆర్‌సీపీకి వ‌స్తున్న ప్ర‌జా ద‌ర‌ణ చూసి జీర్ణించుకోలేక పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని ఇలాంటి చ‌ర్య‌లకు పాల్ప‌డుతుంద‌ని, ఏ రోజు నియోజ‌క‌వ‌ర్గంలో ప్యాక్ష‌న్‌ను ప్రోత్స‌హించ‌లేద‌ని ర‌వి తెలిపారు. శిల్పా కుటుంబం అంటే ప్ర‌తి ఒక్క‌రికి తెలుసు అని తెలిపారు. నాలుగేళ్ల చంద్ర‌బాబు అన్ని వ‌ర్గాల‌ను మోసం చేశార‌ని, వారి అవినీతి బ‌య‌ట‌ప‌డుతుంద‌ని ఇలా మాపై పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని బెదిరింపుల‌కు పాల్ప‌డుతుంద‌న్నారు. ఎవ‌రెన్ని చేసినా వ‌చ్చేది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ‌మే అని ర‌విచంద్ర‌కిశోర్‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు.

Back to Top