ఓట్లు వేయించుకొని మోసం చేస్తావా..!

రాష్ట్రంలో ధరల పెరుగుదలపై వైఎస్సార్సీపీ గర్జంచింది. ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ నిప్పులు చెరింగింది. ధరలను తక్షణమే దించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహించింది. విశాఖలో వైఎస్సార్సీపీ నేతలు పాటలు పాడుతూ, డప్పులు కొడుతూ ప్రభుత్వ పాలనను ఎండగట్టారు. సామాన్యుని నడ్డివిరుస్తున్న ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. 

ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ నేతలు ఫైరయ్యారు. కూరగాయలు, పప్పులు, ఉప్పులు, బియ్యం ఇలా నిత్యవసధరలు ముట్టుకుంటేనే మండిపోతున్నాయన్నారు.  పేదలు తినడానికి కూడా అర్హుడు కాదా అని నేతలు ఈసందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  ధరలు తగ్గించేదాకా ప్రభుత్వం మెడలు వంచుతామని గుడివాడ అమర్ నాథ్ అన్నారు.  వైఎస్ జగన్ ధర్నాకు పిలుపునిచ్చిన వెంటనే...చంద్రబాబు కిలో కందిపప్పు రూ.150కు ఇస్తామని అంటున్నాడని వినయకుమార్ అన్నారు. వైఎస్ జగన్ గుర్తు చేస్తే తప్ప చంద్రబాబుకు ఏకార్యక్రమం గుర్తుకు రావడం లేదని ఎద్దేవా చేశారు.

వైఎస్. రాజశేఖర్ రెడ్డి అట్టడుగు వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందించిన గొప్పనేత అని మహిళా నేతలు ఈసందర్భంగా గుర్తు చేశారు.   చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ముందుకెళుతూ రాష్ట్రాన్ని వెనక్కి నెడుతున్నారని నిప్పులు చెరిగారు.  చంద్రబాబు తగిన బుద్ధి చెప్పే రోజు తొందర్లోనే వస్తుందన్నారు. ధరల నియంత్రణ కోసం వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని తేల్చిచెప్పారు. పెరిగిన ధరలు చూస్తే భయమేసి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని ప్రజలు వాపోతున్నారు. నమ్మించి ఓట్లు వేయించుకొని చంద్రబాబు ఇలా ఎందుకు మోసం చేస్తున్నాడో అర్థంకావడం లేదంటున్నారు.
Back to Top