అనారోగ్యంతోనూ దీక్ష చేస్తున్న ఎంపి వరప్రసాద్

ఢిల్లీ : ప్రత్యేక హోదా కోసం పదవులకు రాజీనామా చేసి మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వైయస్ ఆర్ కాంగ్రెస్ ఎంపిల ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. ఆదివారం ఉదయం తిరుపతి ఎంపి వరప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతూ కూడా దీక్షను కొనసాగిస్తున్నారు.  జ్వరంతో పాటు డీ హైడ్రేషన్‌కు గురయ్యారు.  ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు దీక్ష విరమించాలని సూచించారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని అన్నారు. వైద్యుల సూచనను ఎంపి వరప్రసాద్ తిరస్కరించి, పట్టువీడకుండా దీక్షను కొనసాగిస్తున్నారు.
Back to Top