మోడీ, చంద్రబాబుల దొంగ నాటకాలు

తిరుపతిః నరేంద్రమోడీ, చంద్రబాబుపై వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి నిప్పులు చెరిగారు.  తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... మోడీ, చంద్రబాబులు తిరుపతిలో శ్రీవారి పాదాల సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కారని ఆరోపించారు. 5 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ, టీడీపీ కలిపి మంటగలిపాయని మండిపడ్డారు.

మోడీ, చంద్రబాబులు దొంగనాటకాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఢిల్లీ వెళ్లడం సహా అనేక పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేకహోదా  సాధనే లక్ష్యంగా వైయస్సార్సీపీ ఆగస్టు 2న తలపెట్టిన బంద్ కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.  
Back to Top