కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు, సీట్ల రాజకీయం

తిరుపతి, 27 జూలై 2013:

కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల రాజకీయం చేస్తున్నదని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌కి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తిరుపతిలో శనివారంనాడు ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ తన‌ అభిప్రాయాన్ని చెప్పకుండా గందరగోళంలో పడేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే ఎక్కువ సీట్లు వస్తాయనే ఆలోచనలో ఆ పార్టీ అధిష్ఠానం పెద్దలున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన వైఖరి వెల్లడించనందుకు నిరసనగానే వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశామని ఆయన ‌వివరించారు. కాంగ్రెస్ పార్టీ‌ దాగుడుమూతల తీరు కారణంగానే ఇరు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top