సమైక్య శంఖారావం నిర్వహించి తీరుతాం

తిరుపతి, 14 అక్టోబర్ 2013:

హైదరాబాద్‌ ఎల్‌బి స్టేడియంలో ఈ నెల 19న సమైక్య శంఖారావం బహిరంగ సభను వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించి తీరుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా న్యాయస్థానాల మీద తమ పార్టీకి అపారగౌరవం ఉందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమా‌ర్‌రెడ్డి సోనియా గాంధీ ఏజెంట్‌లా పనిచేస్తూ రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడయ్యారని ఆరోపించారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తిరుపతిలో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ శ్రేణులు చే‌స్తున్న దీక్షలకు కరుణాకరరెడ్డి సంఘీభావం ప్రకటించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో నిర్వహించాలనరి తలపెట్టిన సమైక్య శంఖారావం సభ నభూతో న భవిష్యత్ తరహాలో జరుగుతుందన్న ‌దృఢ విశ్వాసాన్ని భూమన వ్యక్తం చేశారు. 'సమైక్య శంఖారావం'... సమైక్యాంధ్ర ఉద్యమంలో మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు.

Back to Top