మహిళా సదస్సు పేరుతో ప్రజాధనం దుర్వినియోగం

వెంకటాచలం: జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. మహిళా సదస్సుకు ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించి, అందులో పాల్గొనకుండా  అడ్డుకోవడం అప్రజాస్వామ్యకమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.   వెంకటాచలంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతీయ మహిళా సదస్సు రాష్ట్రంలో నిర్వహించడం శుభపరిణామన్నారు. అయితే దేశంలో మేధావులైన మహిళలకు సదస్సుకు ఆహ్వానించకుండా కొందరినే పరిమితం చేయడం వల్ల సదస్సు ఉద్దేశ్యం మంటగలిచిందన్నారు.  మహిళాసదస్సు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ నేతృత్వంలో జరిగిందని, రోజాను అడ్డుకోవడానికి స్పీకర్‌ బాధ్యత వహించి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Back to Top