వైయస్సార్సీపీలో చేరిన టీడీపీ మైనారిటీ నేతలు

తాడికొండః గుంటూరు జిల్లాలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. తాడికొండ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీడీపీ మైనారిటీ నేత‌లు పార్టీ మండ‌ల అధ్య‌క్షుడు తియ్య‌గూర బ్ర‌హ్మారెడ్డి, యువజ‌న విభాగం అధ్య‌క్షుడు ప‌సుపులేటి ఆనంద్ ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ క‌త్తెర హెనీక్రిస్టినా యువకుల‌కు కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో ఎంత శ్ర‌మించినా త‌మ‌కు ప్రాధ‌న్యం ద‌క్క‌డం లేద‌ని పార్టీలో చేరిన యువ‌కులు మండిప‌డ్డారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అలుపెర‌గ‌ని ఉద్య‌మాలు చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పోరాటాలు న‌చ్చి పార్టీలో చేరుతున్నామ‌న్నారు. అనంత‌రం హెనీక్రిస్టినా మాట్లాడుతూ ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఒక్క వాగ్ధానాన్ని కూడా అమ‌లు ప‌ర్చ‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌ప్పుడు మార్గాల‌లో ప‌య‌నిస్తూ దోచుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. భ‌విష్య‌త్తులో టీడీపీ మొత్తం ఖాళీ అవుతోంద‌ని ఎద్దేవా చేశారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 

Back to Top