పోలవరం బాధితులకు సాయంపై ప్రశ్న

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందిన సాయంపై రాజ్యసభలో బుధవారం కేంద్ర ట్రైబల్ అఫైర్స్ శాఖ వివరణ ఇచ్చింది. పోలవరం నిర్వాసితులకు సంబంధించి మొత్తం నాలుగు అంశాల్లో వైయస్సార్‌ సీపీ ఎంపీ(రాజ్యసభ) వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు ట్రైబల్ అఫైర్స్ శాఖ మంత్రి జస్వంత్ సిన్హ్ భాభోర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
 
1. పోలవరం నిర్వాసితులకు పరిహారం, ప్రత్యమ్నాయ ఏర్పాట్లలో జరిగిన లోపాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) నుంచి ప్రభుత్వం నోటీసులు అందుకుందా?
 
ఈ ప్రశ్నపై స్పందించిన ట్రైబల్ అఫైర్స్ మంత్రి.. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) నుంచి నోటీసులు అందుకున్నట్లు చెప్పారు. అందుకు ప్రతిగా స్పందించినట్లు కూడా వెల్లడించారు.
 
2. అటవీ హక్కులు-2006 కింద అడవి బిడ్డలు, గిరిజనులకు పరిహారాలు అందుతున్నాయా?
 ఎఫ్ఆర్-2006 చట్టం కింద అటవీ ప్రాంతాల్లో నివసించే(అర్హత కలిగిన) గిరిజనులను ఎస్టీ కేటగిరీలోకి చేర్చి నిబంధలనల ప్రకారం సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ చట్టం కిందే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన గిరిజనులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
 
3. 20 ఏళ్ల క్రితం చేసిన సర్వే ఆధారంగానే గిరిజనులకు పరిహారాన్ని అందజేస్తున్నారా? గోదావరి జిల్లాల్లోని పైడిపాక, దేవ్రగొండి, మామిడిగొండి, తోటగాంధీ, చేగొండపల్లి, అంగులూర, పుడిపల్లిల్లో సర్వేకు ఏ అంశాలను ప్రమాణికంగా తీసుకున్నారు?
 
2005-2006 సంవత్సరంలో సోషియో ఎకనమిక్ సర్వేను నిర్వహించినట్లు చెప్పారు. 1894 ల్యాండ్ అక్విసిషన్ యాక్ట్ ఆధారంగా గోదావరి జిల్లాల పోలవరం నిర్వాసితులకు పరిహారాన్ని చెల్లించినట్లు తెలిపారు. 2014 జనవరి 1న సేకరించిన భూమినంతటినీ వాటర్ రీసోర్స్ డిపార్ట్ మెంటుకు అందిచినట్లు చెప్పారు.
 
Back to Top