- వైయస్ జగన్ ఎదుట వాపోయిన కుమ్మర్లు- దారిపొడవునా సమస్యలు చెప్పుకున్న రజకులు, గీతా కార్మికులు- నవరత్నాలపై అవగాహన కల్పించిన జననేత విజయనగరంః కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు మీరే ఆదుకోవాలని కుమ్మర్లు వైయస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. కోటగండ్రేడులో వైయస్ జగన్‌ను కుమ్మర్లు కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. వారి కష్టాన్ని జగన్ స్వయంగా పరిశీలించారు. వైయస్‌ఆర్ చేయత పథకం ద్వారా ఆరవై ఏళ్లు నిండితే పింఛన్లు రెండువేలు చేస్తామని వైయస్ జగన్ తెలిపారు. కుమ్మరి చక్రాన్నే నమ్ముకుని తరతరాలుగా కుండలు చేసుకుని బతుకుతున్న తమకు ప్రస్తుతం ఆదరణ లేదని, ప్రత్యామ్నాయం చూపించాలని శాలివాహన సంఘం నాయకులు కోరారు. చెరువుల్లో మట్టిని తవ్వుకునే హక్కు కల్పించాలని విన్నవించారు. స్థానిక సంస్థల్లో తమకూ ప్రాతినిధ్యం కల్పించాలని సంఘం నేతలు విన్నవించారు. తమ ప్రభుత్వం వచ్చాక కుమ్మర్లకు ఒక ఎమ్మెల్సీ ఇస్తానన్న విషయాన్ని వైయస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సమస్యలన్నింటిపై సమగ్ర అధ్యయనం చేసి, తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పెన్షన్లు ఇవ్వడం లేదని.. ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం లేదని, జన్మభూమి కమిటీలు వేధిస్తున్నాయని పలువురు వైయస్ జగన్‌కు ఫిర్యాదు చేశారు.
కుమ్మర్లకు నవరత్నాల పథకాలను వివరించారు. అధికారంలోకి వచ్చిన ప్రతి సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే పలువురు రైతులు జననేతను కలిసి రుణమాఫీ కాలేదు.. కొత్త రుణాలూ లేవు. అప్పోసప్పో చేసి పంట పండిస్తే గిట్టుబాటు ధర లేదు. మార్కెట్‌కు తీసుకెళ్తే 75 కిలోల వడ్ల బస్తాను పదొందలకిస్తావా.. 11 వందలకిస్తావా? అని దళారులు అడుగుతున్నారని చెప్పారు. చివరకు ఏదో విధంగా ధాన్యాన్ని అమ్మినా డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మా డబ్బు మాకు రావడానికి అటు బ్యాంకులోళ్లనీ, ఇటు భూ యజమానుల్నీ బతిమిలాడుకోవాల్సి వస్తోందయ్యా.. మీరే ఏదో విధంగా మమ్మల్ని కాపాడాలి, గట్టున పడేయాలయ్యా..’ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట రైతులు వాపోయారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 281వ రోజు సోమవారం వైయస్ జగన్ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో పలువురు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. చేనేత కార్మికులు, రజకులు, రైతులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఇందుకు స్పందించిన వైయస్ జగన్.. మనందరి ప్రభుత్వం వచ్చాక అందరికీ మేలు చేస్తామని మాట ఇచ్చారు.