మంచినీటి సమస్యపై హెచ్ఆర్సీసీకి ఫిర్యాదు

హైదరాబాద్, 18 ఏప్రిల్ 2013:

రాష్ట్రంలోని మంచినీటి సమస్యను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఒక ఫిర్యాదును అందజేశారు. మంచినీటి సమస్యపై సీఎం ఒక్క సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్సీ ఈ నెల 29లోపు నివేదికి సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది.

Back to Top