మహానేతకు వైయ‌స్‌ జగన్‌ ఘన నివాళి
గుంటూరు: తెలుగునేలపై రాజకీయ చిత్రాన్నే సమూలంగా మార్చిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రను నేటికి సరిగ్గా ప‌దిహేనేళ్లు.  ఒకటిన్నర దశాబ్దాల కింద, ఇదే రోజు... ఏప్రిల్‌ 9న (2003) దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌జాప్ర‌స్థానాన్ని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల  నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా  మ‌హానేత చిత్రపటానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్  జగన్ మోహ‌న్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ గుంటూరు జిల్లా మంచికలపూడి శివారులో మ‌హానేతకు నివాళుల‌ర్పించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top