మహానేత వైయస్‌ స్మారకార్థం ఉచిత వైద్య శిబిరం

పాలకోడేరు (పశ్చిమ గోదావరి జిల్లా), 12 జనవరి 2013: దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి స్మారకార్థం ‌వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు ఉన్నత పాఠశాలలో ఈ ఉచిత ‌ఆయుర్వేద, హోమియో వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నేతలు పశ్చిమగోదావరి జిల్లా నాయకులు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జిఎస్ఆ‌ర్ ట్రస్టు ఆధ్వర్యంలో 10 గ్రామాలకు చెందిన 10వేల మంది వృద్ధులకు వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకుడు గాదిరాజు నాగరాజు బట్టలు పంపిణీ చేశారు.

ఈ ఉచిత వైద్య శిబిరంలో పార్టీ ఎమ్మెల్యే, జిల్లా కన్వీనర్‌ బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పారిశ్రామికవేత్త రఘురామరాజు, మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యేలు పాతపాటి సర్రాజు, గ్రంధి శ్రీనివాస్, అల్లు వెంకట సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ముదునూరి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.
Back to Top