మహానేత పాలనలో సహకార వ్యవస్థ బలోపేతం

మరికల్:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సహకార వ్యవస్థ బలోపేతమయిందని మహబూబ్‌నగర్ డీసీసీబీ అధ్యక్షుడు కె. వీరారెడ్డి చెప్పారు. తీలేర్‌లో ఆయన రబీ రుణాల అంశంపై రైతులతో మాట్లాడారు. వైద్యనాథ్ కమిటీ ద్వారా సహకార వ్యవస్థను పటిష్టపర్చిన ఘనత మహానేతదేనన్నారు. రైతులకు రుణ విముక్తి కల్పించారని గుర్తుచేశారు. జిల్లాలోని 25 సహకార సంఘం భవనాలకు మరమ్మతులు చేశామ ని తెలిపారు.

Back to Top