'జగన్‌ వస్తారు.. రాజీలేని పోరాటం చేస్తారు'

రంగారెడ్డి: కాంగ్రెస్‌. టిడిపి కుట్రల కారణంగా నిర్బంధంలో ఉన్న వైయస్‌సిపి అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి త్వరలోనే జైలు నుంచి బయటికి వస్తారని పార్టీ నాయకుడు దేవ భాస్కర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన బయటికి రాగనే ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తారని భాస్కర్‌ రెడ్డి పేర్కొన్నారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణ పాలన మళ్లీ రావాలంటే శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడమే మార్గమని భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తుందన్న నమ్మకంలో ప్రజలు ఉన్నారన్నారు. మండలంలోని కొంగర రావిర్యాల పంచాయతీ పరిధిలోని దేవేందర్‌నగర్ కాలనీకి చెందిన 100 మంది యువకులు ఆదివారం దేప భాస్క‌ర్‌రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌ సిపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో పాలనావ్యవస్థ పూర్తిగా స్తంభించిందన్నారు. దివంగత నేత వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటికీ ప్ర‌భుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. పేదలకు జరుగుతున్న అక్రమాలపై పోరాడుతున్నందుకే కుట్రపన్ని జగన్‌ను జైలులో పెట్టించారని విమర్శించారు. ఆయన త్వరలోనే కడిగిన ముత్యమోలే జైలు నుంచి బయటకు వచ్చి ప్రజా సమస్యలపై రాజీలేని పోరు చేస్తారని చెప్పారు. అంతకు ముందు దేవేందర్‌నగర్ చౌరస్తాలో వై‌యస్‌ఆర్ సీపీ జెండాను ‌వివిష్కరించారు.
Back to Top