వైయస్‌ఆర్‌సీపీ ప్లీనరీ విజయవంతం చేయాలి

తూర్పు గోదావరి జిల్లా: ఈ నెల 3న మండపేటలో నిర్వహించే వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ప్లీనరీని విజయవంతం చేయాలని పార్టీ కో–ఆర్డినేటర్‌ వేగుళ్ల పట్టాభిరామయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానికకార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీ బలోపేతం కోసం, ప్రజా సమస్యలపై చర్చించేందుకు నిర్వహించే ప్లీనరీకి పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాస్‌చంద్రబోష్, చెల్లుబోయిన వేణుగోపాల్‌కృష్ణ తదితరులు హాజరవుతారని వేగుళ్ల పేర్కొన్నారు.

 

Back to Top