వైయస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులుగా క్రిష్ణప్రసాద్‌

పలమనేరు: పలమనేరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులుగా పట్టణానికి చెందిన క్రిష్ణప్రసాద్‌ను నియమిస్తూ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్‌ రెడ్డి నుంచి ఆదేశాలందాయి. నియోజకవర్గంలో పార్టీ పరంగా విద్యార్థి విభాగాన్ని మరింత పటిష్టం చేస్తామని ఈసందర్భంగా క్రిష్ణప్రసాద్‌ మంగళవారం తెలిపారు. తనకు పదవిని ఇచ్చినందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ ప్రధానకార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానిక కోఆర్డినేటర్లు మొగసాల రెడ్డెమ్మ, సీవీ కుమార్, రాకేష్‌ రెడ్డిలతో పాటు స్థానిక నేతలకు ఆయన కృతజ్ఞతలను తెలిపారు.

Back to Top