వైయస్‌ జగన్‌తో కోటగిరి శ్రీధర్‌ భేటీ

హైదరాబాద్‌ : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని మాజీమంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు శ్రీధర్‌ కలిశారు. ఆయన ఆదివారం లోటస్‌ పాండ్‌లో వైయస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. ప్రజా సమస్యలపై వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపడుతున్న పోరాటాలకు ఆకర్శితుడైన కోటగిరి శ్రీధర్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఈ మేరకు పేర్కొన్నారు. ఈ నెల 29న తాను, తన అనుచరులతో కలిసి వైయస్‌ఆర్‌సీపీలో చేరుతానని శ్రీధర్‌ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగే బహిరంగ సభలో ఆయన అధికారికంగా పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. కాగా ఇటీవలే మాజీమంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్‌ రెడ్డి, అలాగే విజయవాడకు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ కూడా వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన విషయం తెలిసిందే. శ్రీధర్‌తో పాటు పార్టీ నేతలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఆళ్ల నాని కూడా వైయస్‌ జగన్‌తో సమావేశం అయ్యారు. జిల్లా పరిస్థితులు, గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమంపై ఈ భేటీలో చర్చించారు.

Back to Top