`అన్నిడివిజన్లలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ ‌గెలవాలి`

ఖమ్మం, 16 జూన్‌ 2013:

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని డివిజన్లను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకునేలా కృషి చేయాలని ఖ‌మ్మం జిల్లా పార్టీ క‌న్వీన‌ర్ పువ్వాడ అజ‌య్‌కుమార్ ఆ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం పువ్వాడ అధ్యక్షతన ఖమ్మం నగర పార్టీ కార్యకర్తల సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో అజయ్‌కుమార్ మాట్లాడుతూ‌.. ఖ‌మ్మం జిల్లాలో స్థానిక ఎన్నిక‌ల‌కు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంపై ఈ నెల 28న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి విజయమ్మ వస్తున్నారని తెలిపారు.

Back to Top