కాంగ్రెస్, టిడిపిల డిపాజిట్లు గల్లంతు తథ్యం

సత్తుపల్లి‌ (ఖమ్మం జిల్లా) : వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ జెండా కనిపిస్తే ప్రతి గుండె స్పందిస్తోందని, ‌కానీ సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు మాత్రం దడ పుడుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బి.సి. విభాగం కన్వీనర్ గట్టు రామచంద్రరావు ‌వ్యాఖ్యానించారు. జీవితంలో ఇక సిఎం పదవి తమకు దక్కదని వారిద్దరూ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శనివారం సాయంత్రం జరిగిన మరో ప్రజాప్రస్థానం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వై‌యస్ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే పేదల కష్టాలు తీరిపోతాయన్నారు. పాలేరు షుగర్సు విషయంలో దమ్ముంటే నామా నాగేశ్వరరావును అరెస్టు చేసి సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‌సిబిఐ జె.డి. లక్ష్మీనారాయణకు విలువలు లేవని, కాంగ్రెస్‌కు అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారని గట్టు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోనూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ విజయం తథ్యమని చెప్పారు. ‌టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేసినా డిపాజిట్లు కూడా దక్కవన్నారు.

'మహానేత వై‌యస్‌ఆర్ హయాం స్వర్ణయుగం' :
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి పాలన స్వర్ణయుగంలా ఉంటే ఆ తర్వాత ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలం‌బిస్తున్నాయని వైయస్‌ఆర్‌ టియుసి అధ్యక్షుడు బి. జనక్‌ప్రసాద్ విమర్శించారు. మహానేత మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అన్ని వర్గాల ప్రజలపై భారాలు మోపాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ తప్పూ చేయని శ్రీ వైయస్ జగ‌న్‌ను జైలులో పెట్టారని, ఆరుగురు మంత్రులపై నేరాభియోగాలు ఉన్నా ప్రభుత్వం వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. శ్రీ జగన్‌ సిఎం కావాలని ఎనిమిదిన్నర కోట్ల మంది కోరుకుంటున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపిని ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారని హెచ్చరించారు.

ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల గుండెల్లో నిలిచిన దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టాలని పార్టీ ఎస్సీ సెల్ కన్వీన‌ర్ నల్లా సూర్యప్రకా‌శ్‌ కోరారు. మొత్తం 35 లోక్‌సభ స్థానాలను గెలుచుకొని ప్రధానమంత్రి అభ్యర్థిని శ్రీ జగన్ నిర్ణయిస్తారన్నారు.

తాజా ఫోటోలు

Back to Top