కాంగ్రెస్‌కు పరాభవం తప్పదు: కృష్ణదాస్

నరసన్నపేట:

అధికారాన్ని అడ్డంపెట్టుకుని జులుం చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సహకార సంఘాల ఎన్నికల్లో పరాభవం తప్పదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ స్పష్టంచేశారు. ఈ విషయాన్ని గ్రహించే ఆ పార్టీ నాయకులు టీడీపీతో కలిసి ప్రచారం చేస్తున్నారన్నా రు. ఎందరు కుమ్మక్కయినా తమ పార్టీ మద్దతుదారులు ఘన విజయం సాధిస్తారని చెప్పారు. నరసన్నపేట మండలం దాసరివానిపేటలో కార్యకర్తలతో మాట్లాడారు. తమ మద్దతుదారులను ఓడించడానికి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఎవరు ఎవరితో కలుస్తారన్నదానికి ఈ ఎన్నికలే నిదర్శనమన్నారు. రైతు సంక్షేమానికి పాటుపడింది దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖర్‌రెడ్డేనని రైతులు గుర్తించారని, సహకార సంఘాల ఎన్నికల్లో వారంతా  వైయస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులనే గెలిపిస్తారన్న నమ్మకం ఉందని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

Back to Top