'జననేత జగన్ నిర్బంధంపై జనం ఆవేదన'

‌వేంపల్లి, (‌వైయస్‌ఆర్ జిల్లా),

22 మే 2013: జగన్‌బాబును అన్యాయంగా అరెస్టు చేసి జైలులో నిర్బంధించారని రాష్ట్ర ప్రజలంతా ఆవేదన చెందుతున్నారని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌర‌వ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే శ్రీమతి వైయస్ విజయమ్మ అన్నారు. జగ‌న్‌బాబు జైలు నుంచి త్వరలోనే బయటకు వస్తారని, ధైర్యంగా ఉండాలని నియోజకవర్గం ప్రజలకు ఆమె భరోసా ఇచ్చారు. వైయస్‌ఆర్ జిల్లా వేంపల్లి రాజీ‌వ్ కాలనీలో ‌మంచినీటి పథకాన్ని ఆమె బుధవారం మధ్యాహ్నం  ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ మాట్లాడారు.

‌వైయస్‌ఆర్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ఎం.పి. నిధులతో ఈ మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ స్థానికులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చక్రాయపేట మండలంలోని కె.రాజుపల్లెలో తాగునీటి సమస్య తీర్చనున్న పథకాన్ని ప్రారంభించారు.

Back to Top