జనం సంతకంలో జగన్ వెంట మేధావి వర్గం

అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా ‘జగన్ వెంట మేముంటాం’ అంటూ మేధావి వర్గం ‌ముందుకు వచ్చింది. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో శనివారం వైయస్‌ఆర్‌సిపి విద్యార్థి విభాగం నిర్వమించిన  'జగన్ కోసం‌. జనం సంతకం' కార్యక్రమంలో మేధావి వర్గం ఉత్సాహంగా పాల్గొన్నారు. వర్శిటీ ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైయస్‌ఆర్‌సిపి‌ అనంతపురం జిల్లా కన్వీనర్ మాలగుండ్ల నారాయణ, సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి, రాప్తాడు నియోజకవర్గం నాయకుడు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, మైనారిటీ నేత సాలార్‌బాషా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆచార్యులు మాట్లాడుతూ, కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర ప్రభుత్వం‌ శ్రీ జగన్‌పై కక్ష సాధింపునకు పాల్పడుతున్నాయని అన్నారు. అరెస్టుచేసి 225 రోజులు దాటినా సిబిఐ చార్జిషీటు దాఖలు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు.‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై హియరింగ్‌ జరుగుతున్న ప్రతిసారీ సిబిఐ కుంటిసాకులతో అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీలో విద్యావేత్తలు, మేధావులు సంతకాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు రావడంతో శ్రీ జగన్‌కు ఎంతటి ఆదరణ ఉందో స్పష్టం అవుతోందన్నారు. శ్రీ జగన్ అరెస్టును వ్యతిరేకిస్తున్నారని చెప్పేందుకు ప్రజాస్పందనే నిదర్శనమన్నారు.‌ ఇటుకలపల్లి, ఆకుతోటపల్లి ప్రజలు స్వచ్ఛం దంగా తరలివచ్చి సంతకాల సేకరణలో పాల్గొన్నారు.
Back to Top