<strong>అనంతపురం:</strong> రాష్ట్ర ప్రజల హృదయాల్లో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చెరిగిపోని ముద్ర వేశారని వైయస్‌ఆర్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు ఇన్‌చార్జి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. హంద్రీనీవా తొలి దశ పనులకు మహానేత వైయస్ రూ.3,500 కోట్లు కేటాయించి, 90 శాతం పనులు పూర్తిచేశారని గుర్తుచేశారు. అయితే, కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆ ఘనత తనదేనని గొప్పలు చెప్పుకుంటోందని ఆయన ఎద్దేవా చేశారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి 2014లో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు జనంలో పూర్తిగా విశ్వసనీయత కోల్పోయారు. రాచానపల్లి పంచాయతీ సిండికేట్‌నగర్‌లో ఆదివారం పలువురు టిడిపి నాయకులు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రకాష్‌రెడ్డి మాట్లాడారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు వడ్డీలేని రుణాలు, జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తారని ప్రకాష్‌రెడ్డి తెలిపారు. శ్రీమతి షర్మిల నాయకత్వంలో ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీమతి షర్మిలకు తెలంగాణ ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారని పార్టీ గుంతకల్లు ఇన్‌చార్జి వెంకట్రామిరెడ్డి అన్నారు. సిఎం పదవి కోసం చంద్రబాబునాయుడు పడుతున్న తిప్పలు వర్ణనాతీతం అన్నారు. ఏది అడిగినా ఇస్తామంటున్నారు. ఎక్కడి నుండి తెస్తారో? అని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా చిన్నారి శ్వేత మహానేత వైయస్‌ఆర్‌పై పాట పాడి అందరినీ కంట తడిపెట్టించారు.<strong><br/></strong><strong>పార్టీలో చేరిన 50 మంది టిడిపి నాయకులు:</strong>సిండికేట్‌నగర్, నరసనాయనికుంట గ్రామాల నుంచి తెలుగుదేశం నాయకులు గోవిందనాయక్, తిప్పన్న, ప్రసాద్, లాలేనాయక్, రామకృష్ణ, ఆదినారాయణ, గోపాల్, బసవరాజు, రామాంజనేయులు, అక్కులప్ప, నాగభూషణ, ఆనంద్, రామాంజి, రవి, వెంకటేషు, శీనా, అనంతగిరి, వెంకటనారాయణ, ఓబుళపతి, లక్ష్మన్న, ప్రసాద్, హనుమంతు, నాగశెట్టితో పాటు 50 మంది వైయస్‌ఆర్‌సిపి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీలో చేరిన వారిని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.