జనం గుండె చప్పుళ్ళే కోటి సంతకాలు: అంబటి

రాజుపాలెం (గుంటూరు జిల్లా) : జననేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి విడుదల కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది చేస్తున్న సంతకాలు ప్రజల స్పందనకు సజీవ సాక్ష్యాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆ సంతకాలు శ్రీ వైయస్‌ జగన్‌ పట్ల మార్మోగుతున్న జనం గుండె చప్పుళ్ళు అని అభివర్ణించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం కొండమోడులో శనివారం గడపగడపకూ వైయస్‌ఆర్‌సిపి రెండోవిడత ప్రారంభ సభ అంబటి మాట్లాడారు. పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ అధ్యక్షతన‌ ఈ కార్యక్రరమం జరిగింది. 'జగన్‌ కోసం.. జనం సంతకం'లో ఇప్పటికే సంతకాలు 2 కోట్లు దాటాయన్నారు. ఈ జనం సంతకాల హోరులో సిబిఐ కుట్రలు సర్వనాశనం అవుతాయని అంబటి చెప్పారు. సోమవారం వరకు సంతకాలు సేకరించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి అందజేస్తామని ఆయన చెప్పారు.

దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్రకూ... టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి యాత్రకు అసలు పోలికే లేదని అంబటి వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నది ప్రజా సమస్యలు తెలుసుకోడానికా? రికార్డుల కోసమా అని సూటిగా ప్రశ్నించారు. మహానేత వైయస్‌ఆర్ 50 డిగ్రీల‌ సెంటీగ్రేడ్ ‌ఉష్ణోగ్రత ఉన్నప్పుడు నడిరోడ్డుపై నడిచారని, రోడ్డు పక్కనే గుడారంలో విశ్రాంతి తీసుకునేవారని, చంద్రబాబు ఏసీ బస్సులో ఉంటూ తారురోడ్డు కాకుండా మట్టిరోడ్డుపై నీళ్లు చల్లుకుంటూ నడుస్తున్నారని ఎద్దేవా చేశారు.

జనం నుంచి శ్రీ జగన్‌ను దూరం చేయాలనుకున్నవారి కుట్రలు పటాపంచలైపోతాయని మర్రి రాజశేఖర్ చెప్పారు. శ్రీ జగన్‌ను ప్రజలకు దూరంగా ఉంచాలనే కుట్రతో జైలుపాలు చేశారని, ఇలాంటి ప్రభుత్వానికి బుద్దిచెప్పాలని కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ‌శ్రీ జగన్ ఈ తరం, రాబోయే తరాలకూ నాయకుడే అని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి చెప్పారు. పార్టీ కేంద్ర కార్యనిర్వహణ మండలి సభ్యుడు కోన రఘుపతి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా‌ శ్రీ జగన్‌ను ప్రజల నుంచి దూరం చేయలేదన్నారు.

కాంగ్రెస్, ‌టిడిపిలు కుమ్మక్కై దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ సంక్షేమ పథకా‌లను నీరుగారుస్తున్నాయని వైయస్‌ఆర్‌సిపి సీఈసీ సభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి విమర్శించారు. పార్టీ నాయకులు మేరుగ నాగార్జున, నన్నపనేని సుధ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మైనార్టీ సెల్‌ నాయకుడు సయ్యద్ ‌కరీం, పార్టీ యువజన విభాగం ఐదు జిల్లాల కో ఆర్డినేటర్ వనమ‌ బాల వజ్రబాబు, మహిళ అధ్యక్షురాలు వెంకట లక్ష్మీరాజ్యం తదితరులు పాల్గొన్నారు.
Back to Top