జనం బాధలు పట్టించుకోని పాలకులు: షర్మిల

తాడేపల్లి (గుంటూరు జిల్లా), 25 మార్చి 2013: రాష్ట్ర ప్రజలను ప్రేమించిన వ్యక్తి మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అని శ్రీమతి షర్మిల అన్నారు. వంట గ్యాస్‌, విద్యుత్‌ ఇలా దేని మీదా ఒక్క రూపాయి కూడా చార్జి పెంచకుండా ప్రజలను కన్నబిడ్డల మాదిరిగా చూసుకున్నారని గుర్తుచేశారు. ఆ మహానేత విజయవంతంగా అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆమె దుయ్యబట్టారు. ప్రస్తుత పాలకులు ప్రజల కష్టాలను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. జగనన్న నేతృత్వంలో త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని అందరి కష్టాలూ తీరిపోతాయని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి బొమ్మ సెంటర్‌లో సోమవారం  సాయంత్రం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో శ్రీమతి షర్మిల పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల స్థానిక మహిళలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి పాలన‌లో తాము ఎంత హాయిగా జీవించిందీ వారు గుర్తు చేసుకున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, జననేత జగనన్న ముఖ్యమంత్రి అయితే తమ కష్టాలు తీరతాయని తాము ఆశగా ఎదురు చూస్తున్నామన్నారు. ఈ అనాలోచిన ప్రభుత్వం నిర్ణయాల కారణంగా తాము ఎదుర్కొంటున్న బాధలను శ్రీమతి షర్మిలకు చెప్పుకున్నారు. జగనన్నకు ఓట్లేసి తాము గెలిపిస్తామని వారు తెలిపారు. ప్రజల కోసం పుట్టిన నాయకుడు జగనన్న అని అభివర్ణించారు.

ముగ్గురోడ్డు వద్ద ఘనస్వాగతం :
అంతకు ముందు శ్రీమతి షర్మిల ముగ్గురోడ్ చేరుకున్న‌ప్పుడు కు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మరో ప్రస్థానం పాదయాత్రలో భాగంగా వచ్చిన శ్రీమతి షర్మిలను చూసేందుకు జనం వేలాదిగా తరలివచ్చారు. ముగ్గురోడ్‌లో ఏర్పాటు చేసిన మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ విగ్రహాన్ని శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. రాజన్న విగ్రహానికి పూలమాల వేసి ఆమె నివాళులు అర్పించారు.
Back to Top