'జనానికి తొమ్మిదేళ్ళు నరకం చూపిన బాబు'

రాజమండ్రి : చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ళ తన పాలనలో రాష్ట్ర ప్రజలకు నరకం చూపించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. అత్యాచారం దోషులను విడుదల చేయాలంటూ సంతకాలు సేకరిస్తే వదిలేస్తారా? అని నిస్సిగ్గుగా ప్రశ్నించిన చంద్రబాబుకు మహిళల పట్ల ఆయన అసలు తీరు ఏమిటో చెప్పకనే చెప్పినట్లయిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాధవరాయుడుపాలెంలో 'జగన్‌ కోసం.. జనం సంతకం' కోటి సంతకాల కార్యక్రమానికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు.

ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపించిన దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖ‌రరెడ్డి వారసుడిగా శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి రాక కోసం జనం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తుంటే చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడడం తగదని హితవు పలికారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష ‌టడిపిలు కుమ్మక్కై చేసిన కుట్రల ఫలితంగా శ్రీ జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు.‌ ఆ కుట్రలను పటాపంచలు చేసేందుకు ప్రజలు ముందుకు వచ్చి సంతకాలు చేసి తమ అభిమాన నాయకుడు శ్రీ జగన్‌ను విడిచిపెట్టాలని కోరుతున్నారన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి పట్ల రాష్ట్ర ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న అభిమానాన్ని చూసి తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టల్లా మాట్లాడడం తగదని హెచ్చరించారు.
Back to Top