జగన్‌తోనే రాజన్న పాలన సాధ్యం: బాజిరెడ్డి

డిచ్‌పల్లి:

పేద ప్రజల సంక్షేమానికి దివంగత సీఎం వైయస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు ఆయన తనయుడు వైయస్. జగన్మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమని వైయస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు బా జిరెడ్డి గోవర్థన్ స్పష్టంచేశారు. వైయస్ఆర్ పథకాలను కిరణ్ సర్కార్ ప్రణాళిక ప్రకారం నిర్వీర్యం చేస్తోందని  విమర్శించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల గుండెల్లో కొలువైన వైయస్‌ను...వారినుంచి దూరం చేయడానికి ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. వైయస్.జగన్మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ కుట్రపన్ని ఆయనను జైలు పాలు చేశాయని ఆరోపించారు. జగన్ సీఎం అయితేనే రాజన్న రాజ్యం సాధ్యమన్నారు. పార్టీ పటిష్టత కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితు ల్లో లేరని దుయ్యబట్టారు. షర్మిల చేపట్టిన పా దయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, కుట్రలు ప న్నినా వైయస్.జగన్మోహన్‌రెడ్డి త్వరలోనే బయట రావడం ఖాయమన్నారు.

Back to Top