'జగన్‌తోనే మహానేత వైయస్‌ పథకాలు సజీవం'

అనంతపురం : మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలు సజీవంగా ఉండాలంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ అనంతపురం జిల్లా కన్వీనర్ శంకరనారాయణ పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం కోరుతూ వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ని స్థాపించి, సమస్యలపై పోరాడుతున్న జననేత శ్రీ వైయస్ జగ‌న్‌ను అన్యాయంగా జైలుపాలు చేశారన్నారు. తొందరలోనే ఆయన బయటకు వస్తారని కార్యకర్తలు, నాయకులు అధైర్య పడవద్దని శంకరనారాయణ అన్నారు.

'వస్తున్నా మీ కోసం' పాదయాత్రలో అనేక ఉచిత హామీలు ఇస్తున్న చంద్రబాబు మాటలు నమ్మితే ప్రజలు మోసపోయినట్లేనని శంకరనారాయణ హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

రొద్దం మండలంలోని నల్లూరులో టిడిపికి చెందిన 100 కుంటుంబాల నాయకులు, కార్యకర్తలు బుధవారంనాడు వైయస్‌ఆర్‌సిపిలో చేరారు. పార్టీ సీఈసీ సభ్యురాలు సానిపల్లి మంగమ్మ, పార్టీ మండల నాయకుడు కాటిమ తిమ్మారెడ్డి, స్థానిక నాయకులు కిష్టప్ప, ఈశ్వరప్ప, టిడిపి మాజీ సర్పంచ్ గంగయ్య ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అ‌డ్‌హాక్ కమిటీ కన్వీన‌ర్ శంకరనారాయణ సమక్షంలో‌ వారంతా వైయస్‌ఆర్‌సిపి సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా శంకరనారాయణ మాట్లాడారు. వైయస్‌ఆర్‌సిపి ‌జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కోరంట్ల గంపల వెంకటరమణారెడ్డి అధ్యక్షతన గ్రామంలోని సీతారాముల‌ దేవాలయం ఎదుట సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగాల రమే‌ష్, సీఈసీ సభ్యురాలు మంగమ్మ, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే దివంగత రమణారెడ్డి సోదరి ఉషారాణి తదితరులు మాట్లాడారు.
Back to Top